మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
గాయత్రి జయంతిగరుడపంచమి వ్రతం
గరుడపంచమి వ్రతం
స్త్రీలు కోరుకునే ప్రధమ వరం ... ప్రధాన వరం ... సంతానం. మంచి సంతానంతో కూడినటువంటి మాతృత్వాన్నే ప్రతి స్త్రీ ఆశిస్తుంటుంది ... ఆశపడుతుంటుంది. తమ పిల్లలు పరాక్రమవంతులై విజయాలు సాధించాలనే ప్రతి తల్లి కోరుకుంటుంది. అలాంటి స్త్రీలకు అవసరమైన ఉత్తమమైన వ్రతమే 'గరుడపంచమి వ్రతం'.
అన్నదమ్ములున్న యువతులు మాత్రమే 'శ్రావణ శుక్ల పంచమి' తిథిలో ఈ వ్రతమును చేయవలసి వుంటుంది.
ఉదయాన్నే తల స్నానం చేసి కొత్త వస్త్రములు ధరించి పూజా మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠంపై ముగ్గులు వేసి కొత్త వస్త్రమును వేసి బియ్యం పోయాలి. దానిపై గరుత్మంతుడి ప్రతిమను వుంచి షోడశోపచార పూజను నిర్వహించాలి. ధూప .. దీప ... నైవేద్య ... నీరాజనాలను సమర్పించాలి. చేతికి పది ముడులుగల తోరమును కట్టుకుని బ్రాహ్మణ సంతర్పణ చేయాలి. వారికి వాయనదానాలిచ్చి పంపిన తరువాత మాత్రమే ఆహారం తీసుకోవాలి.
ఇక ఈ వ్రతం వెనుక మనకు ... తన తల్లి కోసం ప్రాణాలకు సైతం తెగించిన గరుత్మంతుడి కథ కనిపిస్తుంది. పూర్వం కశ్యప ప్రజాపతికి 'వినత - కద్రువ' అనే ఇద్దరు భార్యలు వుండేవారు. వినతకు పరాక్రమవంతుడైన వైనతేయుడు ( గరుత్మంతుడు) జన్మించగా, కద్రువకు పాములు జన్మించాయి. ఓసారి కావాలనే వినతతో కద్రువ పందెం కాసి, అన్యాయంగా ఆమెను గెలిచి తనకు దాసీగా నియమించుకుంది.దేవలోకం నుంచి అమృత భాండం తెచ్చి సవతి తల్లికి ఇస్తేనే తన తల్లికి దాస్య విముక్తి కలుగుతుందని తెలుసుకున్న గరుత్మంతుడు, వెంటనే అందుకు సిద్ధపడ్డాడు. దేవలోకం వెళ్లి ఇంద్రాది దేవతలను ఎదిరించి అమృత భాండం తెచ్చి తన సవతి తల్లి చేతిలో పెట్టాడు. అలా ఆయన తన తల్లికి దాస్య విముక్తిని కలిగించాడు.
తల్లి పట్ల అద్వితీయమైన ప్రేమానురాగాలను కనబరిచిన గరుత్మంతుడిని విష్ణుమూర్తి అభినందించి తన వాహనంగా చేసుకున్నాడు. గరుత్మంతుడు జన్మించిన ఈ శ్రావణ శుక్ల పంచమి రోజున ఆయనను ఆరాధించిన వారికి పరాక్రమవంతులైన బిడ్డలు కలుగుతారనీ, సకల శుభాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharmam" and Sanatana Dharm & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. 2019-2025 Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.